11 నెలల్లో 4 సినిమాలు

11 నెలల్లో 4 సినిమాలు - Sakshi


 సాధ్యమైనంత ఎక్కువ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు మంచు విష్ణు. పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు... ఈ ఏడాది విష్ణు నటించిన సినిమాలు. ఈ నాలుగింటిలోనూ ఒకదానితో ఒకటి సంబంధం లేని వైవిధ్యమైన పాత్రలే పోషించారు విష్ణు. ఈ 11 నెలల్లో 4 చిత్రాల్లో నటించిన ఏకైక హీరో విష్ణు. ఓ వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా కొనసాగుతూ.. ఎందరో సినీ కళాకారులకు పని కల్పిస్తున్న క్రెడిట్ కూడా నేటి హీరోల్లో విష్ణుదే. తన తండ్రి మోహన్‌బాబు అడుగు జాడల్లో పయనిస్తూ... జయాపజయాలకు అతీతంగా భిన్నమైన పాత్రలతో.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారాయన. ప్రస్తుతం 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై, తన కుమార్తెలు అరియానా, వివియానా సమర్పణలో దేవ కట్టా దర్శకత్వంలో కథానాయకునిగా నటిస్తూ... ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు విష్ణు. అలాగే సంపూర్ణేష్‌బాబు హీరోగా ‘సింగం 123’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. నేడు విష్ణు పుట్టిన రోజు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top