త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం!

త్వరలో మనోజ్, ప్రణతిరెడ్డిల నిశ్చితార్థం!


‘‘గత 40 ఏళ్లుగా నన్నూ, నా కుటుంబాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు, అభిమానులతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. అదేంటంటే... మా అబ్బాయి మనోజ్ వివాహం ఖరారైంది’’ అని మోహన్‌బాబు అన్నారు. ఇంకా చెబుతూ - ‘‘మా పెద్ద కోడలు విరానికా, ప్రణతి క్లాస్‌మేట్స్. ఆ విధంగా ప్రణతి తల్లిదండ్రులు సత్యనారాయణ, ప్రవీణలతో పరిచయం అయ్యింది. రెండు రోజుల క్రితం మనోజ్,ప్రణతిల పెళ్లి గురించి మాట్లాడుకున్నాం. ఓ శుభముహూర్తాన నిశ్చయ తాంబూలం, అనంతరం పెళ్లి జరుపుతాం. నాక్కాబోయే కోడలు ప్రణతి బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివింది. న్యూయార్క్‌లో సీపీఏ చేసింది’’ అని తెలిపారు.



 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top