మహేష్ మూవీ టైటిల్పై క్లారిటీ వచ్చిందా..!

మహేష్ మూవీ టైటిల్పై క్లారిటీ వచ్చిందా..!


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఫస్ట్ లుక్ గాని టైటిల్ లోగో కాని రిలీజ్ కాలేదు. అయితే చాలా టైటిల్స్ సినిమా పేరు ఇదే అంటూ ప్రచారంలోకి వచ్చాయి. చిత్రయూనిట్ మాత్రం ఏ టైటిల్ను అఫీషియల్గా ఎనౌన్స్ చేయలేదు.



తాజాగా మహేష్ మూవీ టైటిల్పై ఓ క్లారిటీ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల విన్నర్ మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా నిర్మాత పీవీపీ చెప్పిన మాటలు సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ తీసుకువచ్చింది. విన్నర్ వేదిక మీద మాట్లాడిన పీవీపీ ఈ ఏడాది నిర్మాత ఠాగూర్ మధు మూడు చిత్రాలను రిలీజ్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న విన్నర్, మిస్టర్, సంభవామి యుగే యుగే చిత్రాలు ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నాడు.



ఇప్పటికే మహేష్ సినిమాకు సంభవామి అనే టైటిల్ పరిశీలనలో ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.  అదే సమయంలో మహేష్, మురుగదాస్ చిత్ర నిర్మాత సంభవామి యుగే యుగే అనే చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేస్తున్నాడన్న క్లారిటీ రావడంతో మహేష్ సినిమా టైటిల్ ఇదే అని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను జూన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top