సినిమా ట్రైలర్‌పై ప్రశంసల జల్లు
మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ రెండో సినిమాగా తెరకెక్కిన 'కంచె' ట్రైలర్ సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటుంది. ప్రముఖ హీరోలతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా ట్రైలర్ బాగుందంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రీమంతుడు సినిమా సక్సెస్ తరువాత ఫారిన్ టూర్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ ట్రైలర్‌పై స్పందించాడు.
'కంచె' టీజర్ పై తన ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించాడు. రెండో ప్రపంచ యుద్ధ నేపధ్యంతో తెరకెక్కిన కంచె ట్రైలర్‌ను చిత్ర యూనిట్ .. ఆ యుద్దం మొదలైన సెప్టెంబర్ 1న రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. 'ముకుంద' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్... ఆ సినిమాలో క్లాసీ మాస్‌గా కనిపిస్తే...కంచెలో మాత్రం డిఫరెంట్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు.
The trailer of Kanche is stunning . All the best to the entire team ..
— Mahesh Babu (@urstrulyMahesh) September 1, 2015
మహేశ్ బాబుతో పాటు ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, మరో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, హీరో రామ్, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్, కెమెరామన్ సెంథిల్.. ఇలా అనేకమంది ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ట్రైలర్ స్టన్నింగ్‌గా ఉందని మెచ్చుకున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ రెండో సినిమా టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించినట్లయింది.
Very impressive. Can see lot of research and hard work going into this one..all the best to team #Kanche https://t.co/Q5TZsdu7Kb
— rajamouli ss (@ssrajamouli) September 1, 2015
#Kanche trailer is fab.Hpy 2 c this change in Telugu Cinema.Congrats @DirKrish & @IAmVarunTej .Tough competition on Oct2..I LIKE ;) #SHIVAM
— Ram Pothineni (@ramsayz) September 2, 2015
Just one word for the trailer of director Krish's #Kanche: STUNNING. Here's the link to the trailer. Watch it! http://t.co/cT4fvWfqEU
— taran adarsh (@taran_adarsh) September 1, 2015
The Trailer looks Stunning, WOW what an effort, Hats off to #Krish and the Whole team of #Kanche. https://t.co/L6shZ3BE5h
— KK Senthil Kumar (@DOPSenthilKumar) September 1, 2015
Guys welcome @nikitindheer this is his first Telugu movie.playing a pivotal role in #Kanche ..looking great brother! https://t.co/AMHKZeHeLQ
— Varun Tej Konidela (@IAmVarunTej) September 1, 2015