'మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు కావాలి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సినిమాకథ

మెగా సంచలనం, ప్రీమియర్లతోనే మిలియన్ మార్క్

Others | Updated: January 11, 2017 13:44 (IST)
మెగా సంచలనం, ప్రీమియర్లతోనే మిలియన్ మార్క్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు అభిమానులను ఆకట్టుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మెగాస్టార్ రికార్డ్ ల వేట మొదలు పెట్టాడు. సూపర్ హిట్ సినిమాలు కూడా వారాంతానికి గాని సాధించలేని మిలియన్ మార్క్ ను మెగాస్టార్ ప్రీమియర్ షోస్ తోచే సాధించేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కన్నా ముందే ఓవర్ సీస్ లో ఖైదీ నంబర్ 150 ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ముఖ్యంగా తొమ్మిదేళ్ల తరువాత తమ అభిమాన నటుణ్ని హీరోగా తెర మీద చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. దీంతో అన్ని ప్రీమియర్ షోస్ పూర్తి కాకముందే ఖైదీ నంబర్ 150 మిలియన్ మార్క్ ను దాటేసింది. అమెరికాలోని 123 లొకేషన్స్ లో రిలీజ్ అయిన ఖైదీ, 1,133,615 డాలర్లకు పైగా వసూళు చేసింది. ఖైదీ కన్నా ముందు 1.36 మిలియన్ డాలర్లతో ఒక్క బాహుబలి మాత్రం తొలి రోజు ఓవర్ సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ లో ఉంది. ప్రీమియర్స్ షోస్ అన్ని పూర్తయ్యే వరకు ఇదే జోరు కొనసాగితే బాహుబలి రికార్డ్ ను ఖైదీ నంబర్ 150 క్రాస్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ విషయాన్ని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తెలుగు సీనియర్ హీరోల్లో నాగార్జున తరువాత మిలియన్ మార్క్ సాధించిన హీరో చిరునే కావటం విశేషం.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అంగన్‌వాడీలపై వరాల జల్లు

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC