'మహిళల ముఖాలు కళకళలాడుతూ ఉంటేనే కుటుంబమూ, సమాజమూ బాగుంటాయి'
x
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సినిమాకథ

మెగా రీ ఎంట్రీపై దర్శకుల స్పందన

Others | Updated: January 11, 2017 14:32 (IST)
మెగా రీ ఎంట్రీపై దర్శకుల స్పందన

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఖైదీ నంబర్ 150 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ హడావిడి చేసేస్తున్నారు. ఈ ఉత్సాహం ప్రేక్షకుల్లోనే కాదు సినీ ప్రముఖుల్లోనూ కనిపిస్తోంది. సినిమా రిలీజ్కు ముందే నాగార్జున, మోహన్ బాబు, రాధిక లాంటి సీనియర్ నటులు మెగాస్టార్ రీ ఎంట్రీ సందర్భంగా శుబాకాంక్షలు తెలియజేయగా రిలీజ్ తరువాత దర్శకులు తమదైన స్లైల్లో స్పందిస్తున్నారు.

తనకు బాగా నచ్చిన సినిమాలపై ట్వీట్ రివ్యూలనందించే రాజమౌళి మెగా రీ ఎంట్రీని ఆకాశానికి ఎత్తేశాడు. 'బాస్ ఈజ్ బ్యాక్, చిరంజీవి గారు తిరిగి ఇండస్ట్రీకి వచ్చినందకు థ్యాంక్స్. పదేళ్ల పాటు మిమ్మల్ని మిస్ అయ్యాం. తొలి చిత్రంతోనే నిర్మాతగా రికార్డ్లు సృష్టిస్తున్నందుకు చరణ్కు శుభాకాంక్షలు. వినయ్ గారు కుమ్మేశారంతే. ఈ ప్రాజెక్ట్ను మీకన్నా బాగా ఇంకేవరూ తీయలేరు.' అంటూ ట్వీట్ చేశాడు.

మెగా అభిమాని హరీష్ శంకర్ అయితే ఏకంగా తన ప్రొఫైల్ పిక్గా చిరు ఫోటో పెట్టేశాడు. ' బాక్సాఫీస్లు బద్దలు, అన్ని ఏరియాలు రఫ్ ఆడిస్తున్న మెగాస్టార్.. బాస్ తిరిగి రావటమే కాదు.. మరిన్ని సంవత్సరాల పాటు మనల్ని అలరిస్తారు.' అంటూ ట్వీట్ చేశాడు. మరో మెగా అభిమాని, దర్శకుడు మారుతి కూడా భారీగా స్పందించాడు.' మెగాస్టార్ ఎరాలో పుట్టినందుకు గర్వపడుతున్నాను. ఖైదీ నంబర్ 150తో బాస్ మాత్రమేకాదు తెలుగు సినిమాకు మంచి రోజులు కూడా వెనక్కి వచ్చాయి' అంటూ ట్వీట్ చేశాడు మారుతి.

 వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

అమెరికా ఫస్ట్ ఆ తర్వాతే అన్నీ..

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC