అదొచ్చేదెప్పుడు... పెళ్లయ్యేదెప్పుడు!

అదొచ్చేదెప్పుడు... పెళ్లయ్యేదెప్పుడు!


కత్రినా కైఫ్‌కి ఈ మధ్య ఓ విషయంలో రక్తం మరుగుతోందట. ఈ మధ్య బాలీవుడ్ మీడియా కత్రినా గురించి సంబోధిస్తున్నప్పుడల్లా ‘రణ్‌బీర్ గాళ్ ఫ్రెండ్’ అంటున్నారట. దానివల్ల కత్రినా తన ఉనికిని కోల్పోతున్నట్లుగా ఫీలవుతున్నారట. అందుకే ఇటీవల ఓ మీడియా సమావేశంలో కత్రినా కైఫ్ కొంచెం ఘాటుగానే స్పందించారు. ‘‘మీరు రణబీర్ గాళ్ ఫ్రెండ్ కదా అని నేను కనిపించిన ప్రతిసారీ అడుగుతున్నారు. నా పేరుకు ఆ ట్యాగ్ తగిలించి పిలుస్తుంటే నా  రక్తం మరుగుతోంది. నాకంటూ ఓ ఐడెంటెటీ ఉంది.



ఇక మీదైనా ప్రశ్నలు అడిగేటప్పుడు హద్దులు మీరొద్దు’’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారామె. ఇంకో విషయం ఏంటంటే.. మీ పెళ్లెప్పుడు? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు, ‘జాతీయ అవార్డు వచ్చినప్పుడు. ఒకటి నాకైనా రావాలి. లేకపోతే నేను నటించిన సినిమాకైనా రావాలి’’ అన్నారు. అదొచ్చేదెప్పుడు? ఈవిడగారి పెళ్లయ్యేదెప్పుడు అని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top