‘వావ్‌ మీవల్లే.. నా సినీ జర్నీకి పదేళ్లు’

‘వావ్‌ మీవల్లే.. నా సినీ జర్నీకి పదేళ్లు’


చెన్నై: ప్రముఖ దక్షిణాది నటుడు కార్తీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అప్పుడే పదేళ్లు అయింది. కానీ, ఆయనను చూస్తే మాత్రం కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చారా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆయన నటన, భాష తీరు, కనిపించే విధానం అంత ఫ్రెష్‌గా ఉంటాయి. అప్పుడే పదేళ్లపాటు సాగిన తన నట జీవితంపై కార్తీ కూడా స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తనపట్ల ఆధారాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ ఓ చిన్న లేఖను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. సరిగ్గా పదేళ్ల కిందట ఇదే ఫిబ్రవరి 23న తాను నటించిన తొలిచిత్రం పరుత్తివీరన్‌ విడుదలైందని గుర్తు చేసి అప్పటి నుంచి తనపై గొప్ప ప్రేమను ప్రేక్షకులు చూపిస్తునే ఉన్నారని అన్నారు.





తన నట జీవితంలో ఎన్నుఎత్తులు పల్లాలు చూశానని, అయినా అన్ని సందర్భాల్లో తనకు తోడుగా ఉండి తన జీవితాన్ని అందంగా కనిపించేలా చేశారని సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు కూడా శక్తివంచన లేకుండా కృషి చేసి అందరినీ అలరిస్తానని, ధన్యవాదాలని చెబుతూ మీ అందరినీ ప్రేమిస్తున్నానంటూ లేఖలో ప్రేక్షకులకు నిరాజనాలు పలికారు. ముందు నుంచి తనకు అండగా ఉన్న భగవంతుడికి, కుటుంబానికి, సోదరుడు సూర్యకు, దర్శకులు, సాంకేతిక బృందానికి, నిర్మాతలకు, సహనటులకు, మిత్రులకు మీడియాకు, పాండియన్‌ మాస్టర్‌కు, థియేటర్స్‌ యాజమాన్యానికి తన ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలని చెప్పారు. 


Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top