మైండ్‌బ్లోయింగ్..
రిలీజైన మూడో రోజే రూ.15 కోట్లు వసూలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బేబీపై డెరైక్టర్ కరణ్ జోహార్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూవీలో అక్షయ్ నటన సూపర్బ్‌గా ఉందన్నాడు. అంతేకాదు అక్షయ్ చేసిన క్యారెక్టర్ కూడా ఎక్స్‌లెంట్‌గా వచ్చిందని తెగ మెచ్చుకున్నాడు. టైరిజమ్పై పోరాడే ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా అక్షయ్ ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడని కితాబిచ్చాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో సెన్సిటివ్ ఇష్యూలను తెలివిగా డీల్ చేశారని, కలెక్షన్లు మరింత పెరుగుతాయని కామెంట్ చేశాడు కరణ్.