'కిస్ కిస్కో ప్యార్ కరూ' రివ్యూ

'కిస్ కిస్కో ప్యార్ కరూ' రివ్యూ


టైటిల్: కిస్ కిస్కో ప్యార్ కరూ

జానర్:   కామెడీ డ్రామా

తారాగణం: కపిల్ శర్మ, అర్బాజ్ ఖాన్, శరత్ సక్సెనా, ఇల్లి అవ్రం

దర్శకత్వం: అబ్బాస్ మాస్తాన్

సంగీతం: జావిద్ మోహిన్, అంజాద్ నదీమ్

నిర్మాత: గణేష్ జైన్, రతన్ జైన్



బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ ఉన్న కపిల్ శర్మ తొలి ప్రయత్నంగా వెండితెర మీద అడుగుపెడుతూ చేసిన సినిమా 'కిస్ కిస్కో ప్యార్ కరూ'. స్మాల్ స్క్రీన్ మీద తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన కామెడీ టైమింగ్నే నమ్ముకొని సిల్వర్ స్క్రీన్ మీద కూడా అడుగుపెట్టాడు కపిల్ శర్మ. సీరియస్ సినిమాల దర్శకులుగా పేరున్న అబ్బాస్-మస్తాన్ జోడీ తొలిసారిగా కామెడీ జానర్లో తెరకెక్కించిన 'కిస్ కిస్కో ప్యార్ కరూ' ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.



కథ :

వాస్తవానికి ఏ మాత్రం దగ్గరగా లేని కథతో తెరకెక్కిన సినిమా ఇది. శివరామ్ కిషన్ (కపిల్ శర్మ) అనుకోని పరిస్థితుల్లో మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ ముగ్గురు భార్యలనూ ఒకళ్లకు తెలియకుండా ఒకళ్లను మెయిన్టెయిన్ చేయడం కోసం శివరామ్ కిషన్ నానా అవస్థలు పడుతుంటాడు. ఇందుకు అతని ఫ్రెండ్ లాయర్ అయిన కరణ్ (వరుణ్ శర్మ) సాయం చేస్తుంటాడు. ఈ సమస్యలు చాలవన్నట్టు అదే సమయంలో దీపిక (ఇల్లీ అవ్రం)తో ప్రేమలో పడతాడు. ముగ్గురు భార్యలుతో పాటు గర్ల్ ఫ్రెండ్కు సమయం ఇవ్వలేక కపిల్ శర్మ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అదే సమయంలో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బావమరిది, మామలను ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే మిగతా కథ.



నటీనటులు సాంకేతిక నిపుణులు :

ఈ సినిమాతో స్మాల్ స్క్రీన్ మీదే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడ తన కామెడీ టైమింగ్కు తిరుగులేదని నిరూపించుకున్నాడు కపిల్ శర్మ. తన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి పర్ఫెక్ట్ జానర్ని ఎంచుకున్న కపిల్ శర్మ.. నటుడిగా మెప్పించాడు. కామెడీ సినిమాలతో పాటు ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడే బాలీవుడ్ ఆడియన్స్ను మెప్పించాడు. వరుణ్ శర్మ కూడా కామెడీ టైమింగ్తో అలరించాడు. అర్బాజ్ ఖాన్, శరత్ సక్సెస్ తన పాత్ర మేరకు బాగానే నటించినా, కీలక పాత్రలో నటించిన ఇల్లి అవ్రం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ షో తప్ప నటనపరంగా ఏమాత్రం విషయం లేదనిపించింది.



తొలిసారిగా కామెడీ జానర్ను డీల్ చేసిన దర్శకలు అబ్బాస్-మస్తాన్ మంచి విజయం సాధించారు. సినిమా ఫస్ట్ టు ఎండ్ ఎక్కడా స్పీడు తగ్గకుండా నవ్వులు పూయించారు. అయితే కొన్ని సీన్స్ విషయంలో లెంగ్త్ ఎక్కువ అయినట్టు అనిపించటం మాత్రం ఇబ్బంది పెడుతుంది. సినిమా ఆద్యంతం ఎక్కడా లాజిక్కు తావులేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. ముగ్గురు భార్యలూ ఒకే బిల్డింగులో ఉన్నా.. ఒకరికి ఒకరు తెలియకపోవటం లాంటి అంశాలు నమ్మశక్యంగా అనిపించవు. కామెడీ సినిమాలకు ప్రాణం లాంటి మ్యూజిక్ విషయంలో ఫెయిల్ అయ్యారు. భం భం బోలో పాట ఒక్కటి తప్ప మరే సాంగ్ గుర్తుండే ఛాన్స్ లేదు.



విశ్లేషణ :

టీవీ స్టార్ కపిల్ శర్మ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం చేసిన తొలి ప్రయత్నంలో మంచి విజయం సాధించాడనే చెప్పాలి. ఇప్పటికే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కపిల్ శర్మ తన కామెడీ టైమింగ్తో సినిమాను వన్ మేన్ షోగా నడిపించాడు. ఇప్పటివరకు కామెడీ సబ్జెక్ట్ను డీల్ చేసిన అనుభవం లేకపోయినా అబ్బాస్ మస్తాన్ లు కిస్ కిస్కో ప్యార్ కరూ మూవీని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. మ్యూజిక్ పరంగా నిరాశపరిచినా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండటం సినిమాకు ప్లస్ అయ్యింది.





ప్లస్ పాయింట్స్



కపిల్ శర్మ

కామెడీ సీన్స్





మైనస్ పాయింట్స్



లాజిక్ లేని స్టోరీ

మ్యూజిక్



ఓవరాల్గా కిస్ కిస్కో ప్యార్ కరూ పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్గా మంచి మార్కులే సాధించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top