ఎక్కువసార్లు పెళ్లి చేసుకుంటా: హీరోయిన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ టాప్‌హీరో హృతిక్ రోషన్ తో వివాదంతో పతాక శీర్షికల్లో నిలిచిన హీరోయిన్ కంగనా రౌనత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఒకసారి కంటే ఎక్కువసార్లు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు సరదాగా వ్యాఖ్యానించింది. ఇండియా కౌంటర్ వీక్ 2016 ఫ్యాషన్ షోలో ప్రముఖ డిజైనర్ మానవ్ గాంగ్వానీ రూపొందించిన పెళ్లి దుస్తులు ధరించి ఆమె క్యాట్ వ్యాక్ చేసింది. వ్యక్తిగత ప్రశ్నలు అడిగితే ప్రశ్నలు అడిగితే జవాబు ఇవ్వనని విలేకరులకు ముందుగానే చెప్పి మీడియాతో మాట్లాడింది.
'మానవ్ రూపొందించిన వెడ్డింగ్ డ్రెస్ చాలా బాగుతుంది. ఈ దుస్తులను నా మొదటి పెళ్లికి ధరించాలనుకుంటున్నాను. ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటేనే కదా ఇలాంటి దుస్తులు ఎక్కువసార్లు వేసుకునే అవకాశం వస్తుంద'ని సరదాగా కామెంట్ చేసింది. మానవ్ డిజైన్ చేసిన పెళ్లి దుస్తులు చాలా బాగున్నాయని కితాబిచ్చింది. మనకు అన్నివిధాలా సరిపోయిన దుస్తులు వేసుకుంటే ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని పేర్కొంది. అయితే తాను ఎప్పుడు పెళ్లిచేసుకునేది 29 ఏళ్ల 'క్వీన్' వెల్లడించలేదు.