దేశం గర్వించేలా చేస్తున్నారు

దేశం గర్వించేలా చేస్తున్నారు - Sakshi


యువకుల పోరాటాన్ని సినిమాకు చెందిన వారు దోచుకోకూడదంటున్నారు నటుడు కమలహాసన్ . తమిళనాట జల్లికట్లు ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. పారంపర్య క్రీడ జల్లికట్టు తమిళుల వీరత్వానికి చిహ్నం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకునేది లేదు అంటూ తమిళనాడులో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రజానీకం ఆందోళన బాట పట్టారు. జల్లికట్టును ఎలాంటి ఆంక్షలు లేకుండా సాధించుకుంటామన్న లక్ష్యానికి దిశగా ఇప్పటికే చేరుకున్నారు. వారికి తమిళసినిమా మద్దతుగా నిలిచింది. ఆది నుంచి జల్లికట్టుకు సపోర్ట్‌ చేస్తున్న విశ్వనటుడు కమలహాసన్  యువత పోరాట పఠిమను ప్రశంసించారు. జల్లికట్టు వ్యవహారంలో ప్రపంచం మనల్ని చూస్తోంది. ఇక్కడ నేను మానవతా దృష్టితో చూస్తున్నది యువత కూటమిని కాదు నవ ఉన్నత ఉపాధ్యాయ కూటమిని. వారికి ప్రణమిల్లుతున్నాను.


జల్లికట్టు కోసం తమిళనాడులో జరుగుతున్న ఆందోళన శిఖరాగ్రస్థాయికి చేరుకుంది. మండే ఎండలను, కురిసే మంచును, వర్షాలను లెక్కచేయకుండా రేయింబవళ్లు పోరాడుతున్నారు. ప్రపంచం మనల్ని చూస్తోంది. భారతదేశం గర్వించేలా చేస్తున్నారు. మీరు లక్ష్య సాధన విషయంలో దృఢంగా ఉండండి. 1930లో సంఘటిత శక్తితోనే మద్రాస్‌ ఏర్పడింది. అది 2017లో మరోసారి విజయవంతంగా సాగుతోంది. రాజకీయ పార్టీలు, టీవీ ప్రచారాలను దృష్టిలో పెట్టుకోండి. సామాజిక మాధ్యమాల ద్వారా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. అహింసామార్గంలో పోరాడి లక్ష్యాన్ని చేరుకోండి. సినీ నక్షత్రాలు యువత పోరాటానికి మద్దుతుగా మాత్రమే నిలబడండి. వారి పోరాటాన్ని తస్కరించరాదన్నదే నా అభిప్రాయం అని కమలహసన్  జల్లికట్టుకు పోరాడుతున్న యువతను ఉద్దేశించి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top