కమల్కు ఫుడ్పాయిజనింగ్.. ఆస్పత్రిపాలు

కమల్కు ఫుడ్పాయిజనింగ్.. ఆస్పత్రిపాలు - Sakshi


విశ్వవిఖ్యాత నటుడు, రచయిత, దర్శకుడు కమల్ హాసన్ ఫుడ్ పాయిజనింగ్కు గురయ్యారు. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కమల్ చికిత్స పొందుతున్నరు. ఆయనను మంగళ లేదా బుధ వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం కనిపిస్తోంది.



59 ఏళ్ల కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడిందని, ఆయన పరిస్థితిని బట్టి ఒకటి రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి. తొలుత కమల్ నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని కథనాలు వచ్చాయి. వాటిని వైద్య వర్గాలు ఖండించాయి. అయితే.. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top