'షేర్' మూవీ రివ్యూ

'షేర్' మూవీ రివ్యూ


టైటిల్ : షేర్

తారాగణం : కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్, విక్రమ్ జిత్ విర్క్, ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి,

దర్శకుడు : మల్లికార్జున్

నిర్మాత : కొమర వెంకటేష్

సంగీతం : థమన్




2015 జనవరిలో పటాస్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండింగ్ లో షేర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సినిమా కథాకథనాల పరంగా ప్రయోగాల జోలికి పోకపోయినా, షేర్ సినిమా విషయంలో భారీ రిస్క్ చేశాడు ఈ నందమూరి హీరో. గతంలో తనే హీరోగా రెండు భారీ డిజాస్టర్ లు అందించిన అదే దర్శకుడితో మరో సినిమా చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. మరి కళ్యాణ్ రామ్ నమ్మకాన్ని దర్శకుడు మల్లిఖార్జున్ ఎంత వరకు నిలబెట్టుకున్నాడు. దశాబ్ద కాలం తరువాత హిట్ ట్రాక్లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ షేర్ సినిమాతో ఆ టెంపోను కంటిన్యూ చేశాడా..? రివ్యూలో చూద్దాం.



కథ :

గౌతమ్ ( కళ్యాణ్ రామ్)  మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ సాదా సీదా కుర్రాడు. సివిల్ ఇంజనీర్గా పనిచేసే హీరో తన కుటుంబం కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ నందిని (సోనాల్ చౌహాన్) తో ప్రేమలో పడతాడు. అయితే అనుకోకుండా తన జీవితంలో ఒకేసారి రెండు మార్పులు చోటు చేసుకుంటాయి.  తన జీవితంలో  ఊహించని మార్పుల కారణంగా తాను ఎప్పటినుంచో కలగంటున్నవాటిని.. కుటుంబం కోసం వదులుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో హీరో తన ప్రేమను, తన కలను ఎలా సాధించాడు అన్నదే మిగతా కథ.



విశ్లేషణ :

నటుడిగా కళ్యాణ్ రామ్ తన మార్క్ చూపించాడు. పటాస్ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా ప్రూవ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ అదే జోరు చూపించాడు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్లు, ఫైట్స్తోనూ ఆకట్టుకున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తెరకెక్కించాలన్న దర్శకుడి ప్రయత్నం సినిమాకు మైనస్ అయ్యిందని చెప్పొచ్చు. కథకు అవసరం లేకపోయినా హీరోయిజం కోసం, కామెడీ కోసం ప్లాన్ చేసిన సీన్స్ ఆకట్టుకోలేకపోయాయి. ఇక హీరోయిన్ పాత్ర కేవలం గ్లామర్ షో తప్ప ఎలాంటి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ముఖేష్ రుషి, ఆశిష్ విద్యార్థి, విక్రమ్ జిత్ లాంటి విలన్స్ ఉన్నా వారిని సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. రోటీన్ కామెడీ సీన్స్ సినిమాకు చాలా పెద్ద మైనస్. ప్రమోషన్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే ఓపెనింగ్స్ బాగుండేవి.



ప్లస్ పాయింట్స్ :



కళ్యాణ్ రామ్

సోనాల్ చౌహాన్ గ్లామర్

కొన్ని కామెడీ సీన్స్



మైనస్ పాయింట్స్ :



సెకండాఫ్ కామెడీ సీన్స్

సినిమా నిడివి

ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్



ఓవరాల్గా కళ్యాణ్ రామ్, మల్లికార్జున్ ల మూడో ప్రయత్నం కూడా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top