రజనీకాంత్ బాటలో ఎన్టీఆర్

రజనీకాంత్ బాటలో ఎన్టీఆర్


హీరోయిజం అంటే అర్ధమేంటి? అల్టిమేట్గా మంచి చేసేవాడే హీరో. రీల్ హీరోలు చాలామంది ఉన్నారు.  మరి వారు రియల్ లైఫ్లో కూడా హీరోయిజం చూపిస్తున్నారా? నిజ జీవితంలో ఎవరికైనా తోటివారికి సహాయసహకారాలు అందిస్తుస్తున్నారా? అందరి సంగతేమో గానీ,  టాలీవుడ్లో ఓ హీరో మాత్రం అదేపనిలో ఉన్నారు. ఎక్కడ తగ్గాలో అతనికి తెలుసు. ఆ విధంగా రియల్ హీరోయిజం చూపిస్తున్నారు.  



ఈ మధ్య టాలీవుడ్‌ సినిమాల బడ్జెట్లు పెగిరిపోతున్నాయి. ఒకరితో మరొకరు పోటిపడే స్టార్‌ హీరోలు నిర్మాతలను ఆదుకోవటంలో కూడా ముందుంటే ఇండస్ట్రీకి మంచిదని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. రజనీకాంత్‌కు స్టార్‌డమ్‌ రావడానికి సూపర్‌స్టార్‌ హెల్పింగ్‌ నేచరే కారణం అంటున్నారు. నిర్మాతలకు నేడు సినిమాలు తీయటం ఒకెత్తైతే, వాటిని రిలీజ్ చేయటం మరో ఎత్తుగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సినిమాలు ల్యాబ్స్ లోనే ఆగిపోతున్నాయి. అలాంటి సినిమాలను హీరోలు ఆదుకుంటారా అంటే, డౌటే. ఎవరి సంగతి ఎలా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పారితోషకం తగ్గించుకుని మరీ నిర్మాతలకు సాయం చేస్తున్నారని సమాచారం.



యంగ్ టైగర్ చాలా సినిమాలకు పెద్ద మొత్తంలో కమిట్ అయ్యి, ఆ తర్వాత రేటు తగ్గించుకుని నిర్మాతలకు సహకరిస్తున్నారని టాక్‌. కోలీవుడ్‌లో తన సినిమాని నమ్మి నష్టపోయిన వారికి సూపర్‌స్టార్‌ రజినీ కాంత్‌ చాలా సందర్భలలో డబ్బులు తిరిగి ఇచ్చారు. ఇప్పడు టాలీవుడ్‌లో యంగ్‌టైగర్‌ అదే రూట్‌ని ఫాలో చేస్తున్నారని వినిపిస్తోంది. రభస విషయంలో జూనియర్ అలాగే చేశారని తెలుస్తోంది. హీరోలు ఈ రకమైన హీరోయిజం చూపితే, వారితో చిత్రాలు నిర్మించే నిర్మాతలకు పండుగే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top