ఆమిర్‌ఖాన్‌కి అభిమాని అయిపోయా!

ఆమిర్‌ఖాన్‌కి అభిమాని అయిపోయా!


ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హాలీవుడ్ స్టార్ జాకీ చాన్‌కి భారతదేశం అంటే ఇష్టం. అలాగే, ఇక్కడి తారల్లో ఆమిర్ ఖాన్ అంటే ఆయనకు విపరీతమైన అభిమానం. జాకీ చాన్ అడపా దడపా హిందీ చిత్రాలు తిలకిస్తుంటారట. ఇప్పటివరకూ ఆయన చూసినవాటిల్లో ‘3 ఇడియట్స్’ కూడా ఉంది. ఆ చిత్రంలో ఆమిర్ కనబర్చిన నటన చూసి, రాత్రికి రాత్రి ఆయనకు అభిమానిని అయిపోయాననీ, ‘హాంకాంగ్’లో అది బాగా ఆడిందనీ జాకీ చాన్ పేర్కొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top