అలాంటి హీరో కోలీవుడ్‌లో లేరు!

అలాంటి హీరో కోలీవుడ్‌లో లేరు!


విజయ్‌సేతుపతి లాంటి హీరో కోలీవుడ్‌లో లేరని దర్శకుడు కేవీ.ఆనంద్‌ అన్నారు. ఆయ న దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కవన్‌. విజయ్‌సేతుపతి, మడోనా సెబాస్టియన్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో సీని యర్‌ నటుడు టి.రాజేంద్రన్‌ ముఖ్యపాత్ర పో షించారు. ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్‌హాప్‌ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు కేవీ.ఆనంద్‌ మాట్లాడుతూ 30 ఏళ్లుగా చూస్తే సమాజంలో చాలా మార్పు వచ్చిందని.. అదే విధంగా 20ఏళ్లుగా చిత్రపరిశ్రమలోనూ సాంకేతికపరంగా చాలా అభివృద్ధి చెందిందన్నారు. తా ను ఇంతకు ముందు కో చిత్రాన్ని మీడియా, రాజకీయం మధ్య జరిగే సంఘటనలతో ఆవిష్కరించానని చెప్పారు. తాజాగా సోషల్‌మీడియా, ఇంటర్నెట్‌లను దాటి వాట్సాప్‌లో సినిమా వార్తలు వెలువడుతున్నాయన్నారు.  సినిమాలోనూ రాజకీయాలు చోటు చేసుకుం టున్నాయని ఈ అంశాలను ఆవిష్కరించే చి త్రంగా కవన్‌ ఉంటుందని చెప్పారు.



ఈ చిత్ర కథను వేరే ప్రముఖ హీరోకు చెప్పినప్పుడు తనకు ఫైట్‌ ఇంతేనా అన్నారన్నారు. మరో నటుడు నటిం చడానికి నిరాకరించారని తెలి పారు. కథకు నప్పే నటుడు ఎవరన్న చర్చ వచ్చినప్పుడు విజయ్‌సేతుపతి కరెక్ట్‌గా న ప్పు తాడని భావించి కథ వినిపించానన్నారు. ఇందులో ఒక యువతి పాత్రకు చిత్ర ప్రారంభంలో మరిన్ని సన్నివేశాలు ఉంటే బాగుం టుందని ఆయన అన్నారన్నారు. తన పాత్రకు కాకుండా వేరే పాత్ర ప్రాముఖ్యత గురించి చెప్పిన విజ య్‌సేతుపతి లాంటి హీరో కోలీవుడ్‌లో మరో కరు ఉండరని కేవీ.ఆనంద్‌ పేర్కొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top