ఆసక్తికరంగా అర్ధనారి

ఆసక్తికరంగా అర్ధనారి


భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ నిర్మించిన చిత్రం ‘అర్ధనారి’. అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు మాట్లాడుతూ - ‘‘దర్శకుడి ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇంకా రాలేదు. ప్రచార చిత్రం థ్రిల్లింగ్‌గా, ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రంతో భాను తప్పకుండా పెద్ద విజయం అందుకుంటాడు’’ అన్నారు. ‘‘ఎవరైనా ప్రముఖ హీరోతో ఈ చిత్రం చేయాలని ప్రయత్నించినప్పటికీ..



అర్ధనారిగా కనిపించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చాలా అరుదుగా ఇటువంటి చిత్రాలు వస్తాయి. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలున్న చిత్రం’’ అని భానుశంకర్ అన్నారు. జూలై 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: నివాస్, కెమేరా: సాయి శ్రీనివాస్ గాదిరాజు, నిర్మాణ నిర్వహణ: కర్లపూడి కృష్ణ, సంగీతం: రవివర్మ.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top