'ఇంకొక్కడు' మూవీ రివ్యూ

'ఇంకొక్కడు' మూవీ రివ్యూ


టైటిల్ : ఇంకొక్కడు

జానర్ : సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్

తారాగణం : విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాజర్, తంభి రామయ్య

సంగీతం : హారిస్ జయరాజ్

దర్శకత్వం : ఆనంద్ శంకర్

నిర్మాత : శింబు తమీన్స్



నటుడిగా తనకు తిరుగలేదని నిరూపించుకున్న చియాన్ విక్రమ్ చాలా రోజులుగా కమర్షియల్ సక్సెస్లు సాధించటంలో మాత్రం వెనుక పడుతూనే ఉన్నాడు. ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్కు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుండటం కూడా విక్రమ్ ఫెయిల్యూర్స్కి కారణం అన్న టాక్ ఉంది. అయితే మరోసారి తానే హీరోగా, విలన్గా నటిస్తూ రూపొందించిన ఇంకొక్కడు(ఇరుముగన్) చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు చియాన్. మరి ఇంకొక్కడు, విక్రమ్కు సక్సెస్ ఇచ్చాడా..?



కథ :

మలేషియాలోని ఇండియన్ ఎంబసీ మీద ఓ 70 ఏళ్ల వృద్ధుడు దాడి చేసి 20 మంది భారతీయ పోలీసుల్ని చంపటంతో సినిమా మొదలవుతోంది. లవ్ (విక్రమ్) అనే కెమికల్ సైంటిస్ట్ రూపొందించిన ఓ డ్రగ్ వల్లనే వయసు అయిపోయిన వ్యక్తి కూడా దాడి చేయగలిగాడని తెలుస్తుంది. లవ్ రూపొందించిన స్పీడ్ డ్రగ్ తీసుకుంటే 5 నిమిషాల పాటు మనిషికి అద్వితీయ మైన శక్తి వస్తుంది. ఈ డ్రగ్ను ఉగ్రవాదులకు అమ్మే ఉద్దేశ్యంలో ఉంటాడు లవ్.


అయితే ఎంబసీ మీద జరిగిన దాడితో ఎలర్ట్ అయిన ఇండియన్ పోలీస్, గతంలో లవ్ కేసును డీల్ చేసి, నాలుగేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న, రా ఆఫీసర్ అఖిలన్ వినోద్(విక్రమ్)కు ఈ కేసు బాధ్యతలను అప్పగిస్తారు. లవ్ కారణంగానే తన భార్యను పొగొట్టుకున్న అఖిల్, లవ్ను అంతమొందించడానికి నిర్ణయించుకుంటాడు. మరో రా ఆఫీసర్ ఆరుషి(నిత్యామీనన్)తో కలిసి మలేషియాలో అడుగుపెట్టిన అఖిల్ అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చివరకు లవ్ కథను ఎలా ముగించాడు అన్నదే మిగతా కథ.



నటీనటులు :

జాతీయ స్థాయి నటుడిగా ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్న విక్రమ్ ఈ సినిమాతో మరోసారి తనలోని నటుణ్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు. సిన్సియర్ రా ఆఫీసర్గా కనిపిస్తూనే గే లక్షణాలున్న క్రూయల్ సైంటిస్ట్, లవ్ పాత్రలోనూ ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్స్ చూపించిన విక్రమ్ నటుడిగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. రా ఆఫీసర్లుగా నయనతార, నిత్యామీనన్లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నయన్ గ్లామర్ షో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. నాజర్, తంబి రామయ్య లాంటి నటులు తమ పరిథి మేరకు అలరించారు.



సాంకేతిక నిపుణులు :

హీరో విక్రమ్తో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ రోల్ చేయించిన దర్శకుడు ఆనంద్ శంకర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ లాంటి నటీనటులను ఒప్పించిన దర్శకుడు అందుకు తగ్గ స్థాయిలో కథా కథనాలను సిద్ధం చేయలేకపోయాడు. యాక్షన్ సీన్స్, ట్విస్ట్లు అలరించినా.. చాలా చోట్ల సినిమా బాగా స్లో అయ్యిందన్న ఫీలింగ్ కలుగుతోంది. కొన్ని సన్నివేశాలు ఏ మాత్రం లాజిక్ లేనట్టుగా అనిపిస్తాయి.


విక్రమ్ లుక్స్, విలన్ క్యారేక్టరైజేషన్ లాంటి అంశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హారిస్ జయరాజ్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. అయితే పాటలతో నిరాశపరిచిన హారిస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో అలరించాడు. కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.



ప్లస్ పాయింట్స్ :

విక్రమ్ నటన

నేపథ్య సంగీతం



మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

పాటలు



ఓవరాల్గా ఇంకొక్కడు, నటుడిగా విక్రమ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించినా, తన స్థాయికి తగ్గ కమర్షియల్ సక్సెస్ మాత్రం అందించకపోవచ్చు.



- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top