అమలాపాల్‌కు నోట మాట లేదు!

అమలాపాల్‌కు నోట మాట లేదు!


తెర మీద ఆడిపాడే తమ అభిమాన తారలు కళ్ల ముందు నిలిస్తే ఎవరైనా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. చటుక్కున నోట మాట రాదు. కాసేపు స్వీట్ షాక్‌కు లోనవుతారు. ఈ అనుభూతికి ఎవరూ అతీతం కాదు. స్వయంగా స్టార్స్ అయినా సరే... తాము అమితంగా ప్రేమించే తారలు ఎదురైతే సరిగ్గా ఇదే పరిస్థితి తప్పదు. తమిళ నటి అమలాపాల్‌కు సరిగ్గా ఇదే ఎదురైంది. ఆమె ఇటీవల ఒక అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఆ తరువాత జరిగిన పార్టీకి వెళ్లిన అమలాపాల్‌కు కళ్ల ముందు నిలిచిన వ్యక్తిని చూసి నోట మాట రాలేదట.


ఇంతకీ ఆమెకు ఎదురుపడిన వ్యక్తి ఎవరో కాదు... బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్. ఆయనను చూసీచూడగానే ఫ్లాటై పోయిన అమలాపాల్ ఆ సంఘటన గురించి చెబుతూ -‘‘నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ‘క హో నా ప్యార్ హై’ రిలీజ్ అయింది. అందులో హృతిక్ అందం చూసి ఫ్లాట్ అయిపోయా. మళ్లీ ఇప్పుడిలా ఆయన నాకు ఎదురుకావడం నా అదృష్టం. వెంటనే ఆయనతో సెల్ఫీ దిగా’’ అని ఆనందంతో మురిసిపోయారు. అమ్మడు ఆ సెల్ఫీని నెట్‌లో కూడా పెట్టింది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top