దేవుడ్ని తిట్టినందుకే నా సినిమాలు ఫ్లాప్: వర్మ

దేవుడ్ని తిట్టినందుకే నా సినిమాలు ఫ్లాప్: వర్మ - Sakshi

సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆస్తికుడిగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దేవుడి కంటే దయ్యాలే మంచివని వాదించే వర్మ.. ప్రస్తుతం భగవంతుడిని నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టు తాజా ట్వీట్ తో అర్ధమవుతోంది. 

 

నా చిత్రాలు పరాజయం పొందడానికి కారణం దేవుళ్లను దూషించడమే కారణమనిపిస్తుంది. ఇక భక్తుడిగా మారాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. దేవుడు మంచి వాడైతే మెదక్ లో జరిగిన రైల్వేగేట్ ప్రమాదంలో చిన్నారులను ఎందుకు పొట్టన పెట్టుకుంటాడు అంటూ వర్మ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top