గౌతమితోనే ఆలోచనలు షేర్ చేసుకుంటా: కమల్హాసన్

గౌతమితోనే ఆలోచనలు షేర్ చేసుకుంటా: కమల్హాసన్ - Sakshi


హైదరాబాద్: తన ఆలోచనలను  మొదట గౌతమితోనే షేర్ చేసుకుంటానని  ప్రముఖ హీరో కమల్హాసన్ చెప్పారు. ఈ రోజు సాయంత్రం ఆయన సాక్షిటీవీకి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. ఉత్తమ విలన్ చిత్రంలో తనలో ఒక హీరోని, ఒక  విలన్ని చూస్తారన్నారు. ప్రతి విలన్లోనూ ఓ మానవతావాది ఉంటారు. ఈ చిత్రం చూసిన తరువాత  ఆ విలన్ పాత్ర నచ్చిందో, లేదో చెప్పాలన్నారు.  సినిమాపై విమర్శల గురించి ప్రశ్నించినప్పుడు  సినిమా బాగోలేదని సినిమా చూసిన తరువాత చెప్పాలన్నారు.   సినిమా ప్రొడక్షన్లో ఉండగా అది మంచా? చెడా? అనేది ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. ఓం నమో నారాయణ అని హిరణ్యకసిపుడు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆయన అలా అంటే ఇక ప్రహ్లాద చరిత్రే  ఉండదని అన్నారు. ఈ చిత్రంపై కోర్టులో దాఖలైన కేసును ఈరోజు  కొట్టివేసినట్లు తెలిపారు.



¤ ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, కె.బాలచందర్ నటించారు. కె.విశ్వనాధ్ గారు ఈ చిత్రంలో ఓ మార్గదర్శిగా నటించారని చెప్పారు. తనకు మార్గదర్శిగా ఉంటారన్నారు. బాలచందర్, విశ్వనాథ్ గార్ల స్నేహం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. వారు ఇద్దరూ గొప్ప వ్యక్తులన్నారు.  బాలచందర్ గారితో ఇది ఆఖరి సినిమా అనుకోలేదన్నారు. మరో రెండు సినిమాలు కూడా చేద్దామని అనుకున్నట్లు తెలిపారు.  



¤ ఉత్తమ విలన్లో మేకప్ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు మేకప్కు మూడు గంటలు సమయం పట్టినట్లు చెప్పారు. మేకప్ వేసుకోవడాన్ని కూడా తాను ఎంజాయ్ చేశానన్నారు.



¤ ఒక కుటుంబంలో పెద్దవారు మంచి కథ గల స్టోరీ ఉండాలని అనుకుంటారు. అబ్బాయిలకు హీరోయిన్ బాగా ఉండాలి.ఆడవారికి సీనియల్లో మాదిరి కధ ఉండాలి.  ఈ సినిమా కుటుంబంలోని అందరికీ నచ్చేవిధంగా ఉంటుందని చెప్పారు.



¤ తన కుమార్తె శృతిహాసన్కు తానేమీ సలహాలు ఇవ్వలేదన్నారు. పిల్లలు వారి ఆలోచనల ప్రకారం నడుచుకుంటారని చెప్పారు. మంచి దర్శకులు చిత్రాలలో నటిస్తే వారి నటనలోపరిణతి వస్తుందని కమల్ హాసన్ చెప్పారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top