అలాంటివాళ్లంటే అసహ్యం

అలాంటివాళ్లంటే అసహ్యం


పదిహేనేళ్ల కెరీర్‌.. 34ఏళ్ల వయసు... మామూలుగా అయితే చాలామంది కథానాయికలు ఈపాటికి రిటైర్‌ అయిపోతారు. కానీ, త్రిషలాంటి తారలు మాత్రం జోరుగా దూసుకెళ్లగలుగుతారు. ప్రస్తుతం ఈ చెన్నై బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. హ్యాపీగా ఉండటానికి ఇంతకన్నా ఏం కావాలి? అంటున్నారు త్రిష. ఇంకా బోలెడన్ని విషయాలు చెప్పారు.

కథానాయికగా మీ ఇన్నేళ్ల సక్సెస్‌కు కారణం?

    నా అభిమానులు, మంచి స్క్రిప్ట్స్, దర్శకులు నా మీద పెట్టుకున్న నమ్మకం.

► ఇన్నేళ్ల కెరీర్‌లో ఎదురైన అత్యంత కష్టమైన సంఘటన?

    వరుసగా 120 రోజులు వర్షంలో షూటింగ్‌ జరిపాం. అప్పుడు ఇబ్బంది పడ్డాను.

► రెమ్యునరేషన్, స్క్రిప్ట్, హీరో.. సినిమా సైన్‌ చేయడానికి మీ ప్రాధాన్యం?

    స్క్రిప్ట్, స్టార్‌ క్యాస్ట్, రెమ్యునరేషన్‌... ఇది ఆర్డర్‌.

►  ఫెయిల్యూర్‌ నుంచి బయటపడటానికి ఏం చేస్తారు?

    ఆత్మపరిశీలన చేసుకుని మరింత కష్టపడేలా ప్లాన్‌ చేసుకుంటాను.

► జీవితంలో మీరు గర్వంగా ఫీలైన సందర్భం?

    నంది, ఎన్‌డీటీవీ అవార్డ్స్‌ తీసుకున్నప్పుడు.

ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు?

    హుందాగా ఉండేవాళ్లంటే ఇష్టం. కపటవేషగాళ్లు, అవసరానికి వాడుకుని వదిలేసేవాళ్లంటే పరమ అసహ్యం.

► వన్‌సైడ్‌ లవ్‌ గురించి చెబుతారా?

    వన్‌ సైడ్‌ లవ్వా.. దాని గురించి నేను చెప్పలేను. ఎందుకంటే నేనెప్పుడూ వన్‌ సైడ్‌ లవ్‌ చేయలేదు.

► వయసులో పెద్ద అమ్మాయి చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయం?

    వాళ్ల మనస్తత్వాలు కలిసి, అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరితే ఓకే. బాగానే ఉంటుంది.

► చెన్నైలో మీ ఫేవరెట్‌ హ్యాంగ్‌ అవుట్‌ ప్లేస్‌?

    మై హోమ్‌ థియేటర్‌.

► మీ ఫేవరెట్‌ వర్కవుట్స్‌?

    బాక్సింగ్, యోగా.

► సమస్యలను ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తారు?

    మా అమ్మగారి సహాయం తీసుకుంటా.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top