నాకింకా అసలు పెళ్లివయసే రాలేదు
గీతాంజలి సినిమా విజయం సాధించి, జయం రవితో తమిళ సినిమాలో చేస్తూ మంచి బిజీగా ఉన్న అంజలి.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునేది లేదని తేల్చిచెప్పేసింది. ముందు కెరీర్ చూసుకోవాలని, అందుకే తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని ఆమె తెలిపింది. తన పెళ్లి విషయంలో ఇప్పటివరకు వస్తున్నవన్నీ రూమర్లేనని కూడా స్పష్టం చేసింది.
ఒక వ్యాపారవేత్తతో తన పెళ్లి జరగబోతున్నట్లు కొన్ని వదంతులు వచ్చాయని, అయితే అవేవీ వాస్తవం కాదని అంజలి చెప్పింది. ఇప్పుడు తాను కెరీర్లో చాలా బిజీగా ఉన్నానని, అందువల్ల పెళ్లి గురించి ఆలోచించే తీరికే తనకు లేదని తెలిపింది. అయినా పెళ్లి గురించి ఆలోచించేంత వయసు కూడా తనకు ఇంకా లేదని 28 ఏళ్ల అంజలి అంటోంది. కన్నడంలో కూడా 'ధీర రణ విక్రమ' సినిమా షూటింగులో ఈమె బిజీగా ఉంది.