బాలీవుడ్ హీరోలకు హృతిక్ ఛాలెంజ్!
ముంబై:బాలీవుడ్ ప్రముఖ నటులకు 'బ్యాంగ్ బ్యాంగ్' హీర్ హృతిక్ రోషన్ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరాడు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్ర ప్రమోషన్లో భాగంగా హృతిక్ పలువురు బాలీవుడ్ నటులకు ట్విట్టర్ లోఛాలెంజ్ లతో ఆకట్టుకున్నాడు. వీరిలో మన బాద్ షా షారుఖ్ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు. దర్శకుడు సిద్దార్ధ ఆనంద్ తెరకెక్కిస్తున్న 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రంలో సరికొత్తగా కనిపించనున్నహృతిక్... షారూఖ్ ఖాన్ నూతన చిత్రంలోని తన 10 ప్యాక్ ను సవాల్ చేసే ధైర్యం ఉందా? అంటూ పేర్కొన్నాడు. ఆ చిత్రంలోని 10 ప్యాక్ ఫోటోను పోస్ట్ చేసి నా సవాల్ ను స్వీకరిస్తారా? అంటూ ట్వీట్ చేశాడు.
' దీనికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. మాకు ఏది గొప్ప ఫోటో అనేది తెలుసుకోవాలని ఉంది' అని హృతిక్ తెలిపాడు. ఈ క్రమంలోనే తన సహచర నటులు ఫిట్ డినో మోరియో, ఉదయ్ చోప్రాలకూ కూడా హృతిక్ ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరాడు.
సంబంధిత వార్తలు