అమ్మ చెప్పిందే చేస్తా: హీరోయిన్

అమ్మ చెప్పిందే చేస్తా: హీరోయిన్


చెన్నై: చాలా మంది హీరోయిన్లు టాప్ నటిమణులుగా  రాణిస్తున్నా ఇప్పటికీ తల్లి చాటు బిడ్డలాన్నే ప్రవర్తిస్తుంటారు. వారిని ఏ విషయం అడిగినా అమ్మనడగండి అంటుంటారు. హన్సిక ఈ కోవకు చెందిన నటినే. కోలివుడ్, టాలీవుడ్ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించి ప్రముఖ హీరోయిన్గా వెలుగొందుతున్న ఈ బ్యూటీది చాలా మంది కంటే భిన్న మనస్థత్వం.



ముఖ్యంగా సేవాభావం ఎక్కువ. తన ప్రతి పుట్టిన రోజుకు ఒకరి చొప్పున ఇప్పటికే 32 మంది అనాధ పిల్లల్ని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. హన్సిక తన పుట్టిన రోజును ముంబాయిలో దత్తత పిల్లల మధ్య బుధవారం జరుపుకున్నారు. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా ఉదయాన్నే దైవ పూజలు నిర్వహించి ఆ తరువాత తన దత్తత పిల్లల మధ్య గడిపారు.



దీనిపై హన్సిక మాట్లాడుతూ.. తన పుట్టిన రోజును పిల్లల మధ్య  జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు వచ్చిన బహుమతులను పిల్లలకు పంచడంలో ఉన్న ఆనందమే వేరన్నారు. ఇతరులకు సాయం చేయటం, మంచి ప్రవర్తనతో మెలగాలన్నది తన తల్లి చిన్నతనంలోనే నేర్పారనీ పేర్కొన్నారు. అమ్మ చెప్పింది ఇప్పటికీ, ఎప్పటికీ పాటిస్తానని హన్సిక ఈ సందర్బంగా చెప్పారు.

 




Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top