బాలకృష్ణకు పూరి జగన్నాథ్‌ ‘టపోరి’!

బాలకృష్ణకు పూరి జగన్నాథ్‌ ‘టపోరి’! - Sakshi


దర్శకుడు పూరి జగన్నాథ్‌ తన చిత్రాలకు వెరైటీ టైటిల్స్‌ పెట్టడంలో ముందంజలో ఉంటాడు.  ఇప్పటికే ‘రోగ్‌’  టైటిల్‌తో సంచలనం రేపిన పూరి... తాజాగా హీరో బాలకృష్ణతో చేస్తున్న చిత్రానికి ‘టపోరి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ సినిమాలు అంటేనే మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటాయి. అంతేకాకుండా బాలయ్య సినిమా టైటిల్స్‌ కూడా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దీంతో టపోరరి  టైటిల్ క్యాచీగా ఉండడంతో పూరీ ఆ టైటిల్ వైపే మొగ్గుచూపుతున్నాడట. ‘టపోరి’ హిందీ పదం కాగా తెలుగులో రౌడీ అని అర్థం.



కాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ తన 101వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ గత చిత్రాలకు ఈ సినిమా భిన్నంగా ఉండనుందట. అందుకే బాలయ్య క్యారెక్టర్‌కు సరిపోయేలా ఈ సినిమాకు టపోరి పేరు సరిపోతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అధికారికంగా మాత్రం ‘టపోరి’ టైటిల్‌ ఇంకా కన్ఫామ్‌ కాలేదు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top