ఆయన కోసం పది సినిమాలైనా వదులుకుంటా: హేమ

ఆయన కోసం పది సినిమాలైనా వదులుకుంటా: హేమ - Sakshi


దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ తనకు గాడ్ ఫాదర్ లాంటివారని నటి హేమ అన్నారు. దర్శకుడు కాకముందు నుంచి తన కోసం ఆయన మంచి పాత్రలు సృష్టించారని ప్రశంసించారు. ఆయన తనకు మంచి మిత్రుడని ఓ టీవీ కార్యక్రమంలో హేమ వెల్లడించారు. ఆయనతో కలిసి పనిచేయడానికి పది సినిమాలైనా వదులుకునేందుకు వెనుకాడబోనని చెప్పారు.



'తివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో నటించిన తర్వాత నాకు వందల సంఖ్యలో అవకాశాలు వచ్చాయి. ఆయన నా కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించారు' అని హేమ అన్నారు. తొమ్మిదేళ్లుగా ఆయన సినిమాల్లో నటిస్తున్నానని చెప్పుకొచ్చారు. తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అతడు, జులాయి సినిమాల్లో హేమ నటించారు. ఆయన మాటలు అందించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top