Alexa
YSR
‘సంపద అట్టడుగు వర్గాలకు చేరితే వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సినిమాకథ

నేనింతే.. ఇలాగే ఉంటాను: నటి

PTI | Updated: January 10, 2017 12:08 (IST)
నేనింతే.. ఇలాగే ఉంటాను: నటి

లండన్: చాలామంది సెలబ్రిటీలు తమ రోజువారీ విషయాలను సోషల్ మీడియాలో అప్‌డేట్ చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉండాలని భావిస్తారు. కానీ, టీనేజ్ సంచలనం హాలీవుడ్ నటి, సింగర్ మేరీ ఎల్లె ఫానింగ్ మాత్రం ఇలాంటి విషయాలకు దూరంగా ఉంటుందట. తన వ్యక్తిగత జీవితాన్ని అందరితో పంచుకోవడం తనకు ఇష్టంలేదని 18ఏళ్ల బ్యూటీ అంటోంది. జీవితంలో కొన్ని విషయాలను సీక్రెట్‌గా ఉంచితేనే లైఫ్ లో  థ్రిల్ ఉంటుందని లేకపోతే అంతా రొటీన్ అవుతుందని తన తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలను 'నియాన్ డెమాన్' ఫేమ్ పంచుకుంది.  

'నా పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ ఓపెన్ చేశాను. అయితే అందులో ఇప్పటివరకూ ఎలాంటి విషయాలను పోస్ట్ చేయలేదు. ఇంకా చెప్పాలంటే నాకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో అకౌంట్ లేదు. ప్రతిఒక్కరూ ఒకేలా ఉండాలని లేదు. కొందరు తమ వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేసుకుంటారు. మరికొందరు చాలా విషయాలను సీక్రెట్‌గా ఉంచుతారు. లేకపోతే ఏ బ్రేక్‌ఫాస్ట్ తిన్నామో కూడా అందరికీ చెప్పాలా ఏంటి?. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన మనస్తత్వం. కొందరికి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారని, అలాంటి వాళ్లను చూస్తే చాలా ఈర్ష్యగా అనిపిస్తోంది. నా వరకు ఇలాగే ఉండేందుకు ఇష్టపడతాను' అని అమెరికన్ బ్యూటీ మేరీ ఎల్లె ఫానింగ్ చెప్పుకొచ్చింది.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

భారత రాష్ట్రపతి కోవిందుడు

Sakshi Post

Despite Chandrababu’s Tall Claims, Polavaram Cannot Be Completed By 2018

Centre’s reply exposes TDP Government’s false propaganda

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC