అన్ హ్యాపీ ఇయర్
తాను అవార్డుల కోసం నటించడం లేదంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్. ఈసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నామినీస్‌లో తన పేరు లేకపోవడంపై కాస్త నారాజ్ అయిన షారుఖ్.. ‘నేను బాగా నటించి ఉండక పోవచ్చు.. అందుకే నా పేరు లేదు’ అని చెప్పాడు. అంతటితో ఆగకుండా తన కంటే బెటర్‌గా నటించిన వాళ్లు చాలామందే ఉన్నారంటూ కామెంట్ చేశాడు. ‘నేను గతేడాది ఒకే సినిమాలో నటించాను, రెండు షోలు హోస్ట్ చేశాను.. సినిమా పరంగా హ్యాపీ న్యూ ఇయర్ సూపర్బ్, నా నటన అవార్డు అందుకునే స్థాయిలో లేదు’ అంటూ కాస్త కోపం, అసహనం కలగలసిన వాయిస్‌లో చెప్పుకొచ్చాడు.
సంబంధిత వార్తలు