చెత్త కామెంట్లు చేస్తే వదిలిపెట్టను..!

చెత్త కామెంట్లు చేస్తే వదిలిపెట్టను..! - Sakshi


నోయిడా: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇండస్ట్రీకి పరిచయమే అప్పుడే పదేళ్లయింది. ఈ పదేళ్ల సినీ ప్రయాణం రోలర్ కోస్టర్ రైడ్ చేసినట్లుందని ఆమె వ్యాఖ్యానించింది. జాతీయ అవార్డుల పంట పండించిన 'క్వీన్' భామ ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులను చవిచూసింది. 'నా సినీ జీవితం తెరచిన పుస్తకం లాంటిది. రోలర్ కోస్టర్ ఎక్కితే ఎలా ఉంటుందో నా జీవితం అలా సాగుతోంది. ప్రతి ఒక్కరికి ఏం జరుగుతందో తెలుసు. నా జీవితంలో జరిగిన వాటికి మీరందరూ సాక్ష్యులు' అని కంగనా అంటోంది.



నటుడు హృతిక్ రోషన్ తో ప్రేమాయణం, ఆ తర్వాత పరస్పర మనస్పర్థలతో గొడవ గా మారి లీగల్ నోటీసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఎంత సెలబ్రిటీలు అయినా, మేము కూడా మనుషులమే అని పేర్కొంది. ఏది ఏమైతేనేం కెరీర్ అలా సాగిపోతోందని, సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై కూడా స్పందించింది. సోషల్ మీడియాలో ఉండటం తనకు నచ్చదని అందుకే అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటానన్నది.



విలువైన విమర్శలపై మాత్రమే తాను ఆలోచిస్తానని, అంతేకానీ చెత్త వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తిలేదని కంగనా తేల్చిపారేసింది. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడానికి సోషల్ మీడియా చాలా అవకాశం కల్పిస్తుందని, మీరు అనుకున్నట్లు అలాంటి అకౌంట్లు క్రియేట్ చేసుకోవడంపై తనకు ఆసక్తిలేదని స్పష్టం చేసింది. మనం అనుకున్నట్లు జీవితాన్ని లీడ్ చేయలేమని, ఏదో రకంగా మాత్రం గడపాల్సి వస్తుందని కంగనా రనౌత్ అభిప్రాయపడింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top