నేను చూసిన అద్భుత మహిళ
నేను చూసిన అద్భుత మహిళ నీవు అని యువ దర్శకుడు విఘ్నేశ్ శివ అన్నారు. ఇంతకీ ఈయన ఇంతగా పొగడ్తలతో ముంచెత్తిన ఆ మహిళ ఎవరో ఈ పాటికే మీకు అర్థమయిపోయి ఉంటుంది. ఎస్ ఆ బ్యూటీ నేటి టాప్ నటి నయనతార. వీరిద్దరి మధ్య సంబంధం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. సినీ వర్గాలందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కాగా నటి నయనతార గాని, దర్శకుడు విఘ్నేశ్శివగాని ఒకరిపై ఒకరికి గల ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి లభించే ఏ సందర్భాన్ని వదులు కోవడం లేదన్నది గమనార్హం. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ప్రేయసిగా ప్రచారంలో ఉన్న నయనతారను ఉద్దేశించి దర్శకుడు విఘ్నేశ్శివ తన ట్విట్టర్లో ఈ విధంగా పేర్కొన్నారు.
హాయ్ పెట్రి ఫిగర్.. ఎన్నో అవాంతరాలు, అపజయాలను ఎదిరించి గెలిచావు. విమర్శలు, వివాదాలను, మెక్సికోలో జరిగిన వివాదాస్పద సంఘటనను చిరునవ్వుతోనే ఎదుర్కొన్నావు. బలం, ఆత్మవిశ్వాసం, మంచితనం, సానుకూల దృక్పథం లాంటి అంశాలు కలిగిన అద్భుత మహిళను నేను నీలోనే చూశాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పేర్కొని నిజమైన ప్రేమికుడిగా మరోసారి నిరూపించుకున్నారు.