లంగా ఓణీ... సిల్కు రిబ్బను...

లంగా ఓణీ... సిల్కు రిబ్బను...


1980లలో కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్‌ రూపొందిస్తున్న సినిమా ‘రంగస్థలం’. ఇందులో రామ్‌చరణ్‌ రాజు. అంటే హీరో ఆయనే కదా! మరి, అప్పుడు రాణి ఎవరవుతారు? ‘రంగస్థలం’లో హీరోయిన్‌గా నటిస్తున్న సమంతే కదా! మీరు ఫొటోలో చూస్తున్నది ఆ రాణీగారినే.



సమంత ఫేస్‌ కనిపించకున్నా... నెట్టింట్లో ఈ ఫొటో గురించే హాట్‌ టాపిక్‌! ఎందుకంటే... సమంత కట్టుకున్న లంగా ఓణీ, జడకు కట్టుకున్న సిల్క్‌ రిబ్బన్లను ఇప్పట్లో అమ్మాయిలెవరూ ఎక్కువగా వాడటం లేదు కదా! అబ్బో... దర్శకుడు సుకుమార్‌ సినిమాలో 80ల వాతావరణం తలపించేలా భలే జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఆల్రెడీ గుబురు గడ్డం, గళ్ల లుంగీలో ఉన్న రామ్‌చరణ్‌ వర్కింగ్‌ స్టిల్స్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ‘రంగస్థలం’ షెడ్యూల్‌ వారం రోజులు రాజమండ్రిలో జరిగింది. అక్కడ షెడ్యూల్‌ ముగించుకుని, ఈ యూనిట్‌ హైదరాబాద్‌ చేరుకుంది. ఎర్నేని నవీన్, చెరుకూరి మోహన్‌ (సీవీయం), వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top