ఫేక్ రికార్డ్స్ కోసం పాకులాడం : రాజమౌళి

ఫేక్ రికార్డ్స్ కోసం పాకులాడం : రాజమౌళి - Sakshi


బాహుబలి సినిమాతో భారతీయ సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి సినిమా విడుదలై 50 రోజులైంది. ఈ సందర్భంగా రాజమౌళి స్పందిస్తూ.. ఈ సినిమాను రికార్డ్ ల కోసం బలవంతంగా థియేటర్లలో కొనసాగించబోమని తేల్చి చెప్పారు. సినిమా 100 రోజులు, 175 రోజులు ఆడిందన్న రికార్డ్ లు గత చరిత్ర అన్న రాజమౌళి ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రికార్డ్ లు అసాధ్యం అని తేల్చేశారు. భారీ చిత్రాలన్నీ వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయన్న దర్శక ధీరుడు ఆ సినిమాలు మూడు నాలుగు వారాలకు మించి కలెక్షన్లు వసూలు చేసే పరిస్థితి లేదన్నారు.



బాహుబలి సినిమాను కూడా రికార్డ్ ల కోసం బలవంతంగా ఏ ఒక్క థియేటర్ లో కూడా కొనసాగించబోమని చెప్పాడు. కలెక్షన్లు లేకపోయినా సినిమాను థియేటర్లలో ఉంచటం వల్ల అదే సమయంలో రిలీజ్ అయ్యే చిన్న సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడుతుందని, అందుకే ఎవరూ అలాంటి ఫేక్ రికార్డ్స్ కోసం ప్రయత్నించొద్దని సలహా ఇచ్చారు. ప్రభాస్, రానాలు లీడ్ రోల్స్ లో తెరకెక్కిన బాహుబలి జూలై 10 న రిలీజ్ అయి ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ విజువల్ వండర్ 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సౌత్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top