అందుకే ఆ టైటిల్ పెట్టాం!
‘‘హీరో ప్రభాస్ ‘జిల్’ చిత్రాన్ని ఎడిటింగ్ రూమ్‌లో చూసి, ‘చెప్పడానికి కరెక్షన్స్ ఏమీ లేవు. బాగా తీశావు’ అని మెచ్చుకున్నారు. మా గురువుచంద్రశేఖర్ యేలేటి కూడా బాగా తీశావని మెచ్చుకున్నారు. నాకు వచ్చిన గొప్ప ప్రశంసలివి’’ అంటున్నారు దర్శకుడు రాధాకృష్ణకుమార్. గోపీచంద్, రాశీఖన్నా జంటగా యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ నిర్మించిన ‘జిల్’ ఇటీవల విడుదలైంది. రాధాకృష్ణకుమార్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘హీరో, విలన్‌ను మొదటిసారి కలిసే సన్నివేశాలు ప్రేక్షకులకు జిల్ అనిపించేలా ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు ‘జిల్’ అనే టైటిల్ పెట్టాం. గోపీచంద్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రెడీ చేశా. ‘ఊహలు గుసగుసలాడే’లో రాశీఖన్నా హావభావాలు చూసి సావిత్రి పాత్రకు ఆమెను తీసుకున్నా. తదుపరి చిత్రం కూడా యాక్షన్ నేపథ్యంలోనే’’అని చెప్పారు.