'ముస్లిం యువతిని పెళ్లాడటం నాన్నకు ఇష్టమే'

'ముస్లిం యువతిని పెళ్లాడటం నాన్నకు ఇష్టమే'


చెన్నై: తాను ముస్లిం యువతిని పెళ్లాడటం తన తండ్రి, ప్రఖ్యాత తమిళ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇష్టమేనని ఆయన కుమారుడు వర్ధమాన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా పేర్కొన్నారు. యువన్ 2014 లో ఇస్లాం మతం స్వీకరించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన జఫరున్నీసా అనే ముస్లిం యువతిని పెళ్లాడారు.  ఆయనకిది మూడో పెళ్లి.  సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇళయరాజా తన పెళ్లికి హాజరుకాలేకపోయారని యువన్ తెలిపారు. అయితే పెళ్లి అనంతరం ఇళయరాజా ఇంటికి వెళ్లినప్పుడు ఆయన తనకు సాదరస్వాగతం పలికారని యువన్ అన్నారు. తాను ఇస్లాంలోకి మారినప్పటికీ యువన్ అనే పేరునే ఇష్టపడతానని అన్నారు.

     పేరు మార్పుపై స్పందిస్తూ..."యువన్ అనేది నా ఐడెంటిటీ, ఆ పేరును నేను మార్చుకోవాలనుకోవటంలేదు. మతాన్నితప్ప మరేదీ మార్చుకోవడానికి నేను సిద్ధంగా లేను. గత కొన్నేళ్లుగా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. స్వయంకృతాపరాధంతో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నాను. ప్రస్తుతం నా వృత్తిమీద దృష్టిపెట్టాను. మార్చి 9వ తేదీ కేరళలోని తిరునల్వేలిలో నిర్వహించబోయే ప్రదర్శనకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని యువన్ తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top