Alexa
YSR
‘పారిశ్రామిక రంగానికి దీటుగా సేద్యరంగం ఎదగాలి. వ్యవసాయ ఫలాలు పదింతలు పెరగాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం సినిమాకథ

చిక్కుల్లో కమల్ హాసన్‌

Others | Updated: April 21, 2017 20:31 (IST)
చిక్కుల్లో కమల్ హాసన్‌

తిరునెల్వేలి: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ చిక్కుల్లోపడ్డారు. హిందువులు పవిత్రంగా భావించే మహాభారత ఇతిహాసంపై కమల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా తమిళనాడులోని వలియూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులో మే 5వ తేదీన హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది. నరుంబూనాథర్‌ ఆలయ భక్తుల సమాఖ్య కార్యదర్శి ఆదినాథ సుందరం ఫిర్యాదు మేరకు ఈ కేసును విచారణ చేసి, తమకు నివేదిక సమర్పించాల్సిందిగా పజువూర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను వలియూర్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ సెంథిల్‌ కుమార్‌ ఆదేశించారు.

గత మార్చి 12న ఓ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌ మహాభారతంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్టు పిటిషన్‌దారు పేర్కొన్నారు. సినిమాలలో మహిళలపై ఎక్కువగా హింసాత్మక దృశ్యాలు చూపించడం గురించి అడిగిన ఓ ప్రశ్నకు కమల్‌ బదులిస్తూ.. దేశంలో ప్రజలు మహిళలను తక్కువ భావనతో చూస్తారని, మహాభారతంలో కూడా ఓ మహిళను పాచికలాటలో పందెం కాశారని చెప్పారు. భారతీయులు మహాభారత్‌ను అమితంగా గౌరవిస్తారని, ఈ ఇతిహాసంలో మహిళను జూదంలో పావుగా చూపించారని తెలిపారు. హిందువులను, మహాభారత్‌ను అవమానించేలా కమల్‌ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానా వేయాలని  పిటిషన్‌దారు కోర్టును కోరారు.

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

సాగు యజ్ఞం

Sakshi Post

Websites Of DU, AMU, IIT-Delhi Hacked

The hacked websites belong to prestigious universities

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC