'టెంపర్'తో పోలిస్తే పోకిరీ ఫ్లాపే: వర్మ

'టెంపర్'తో పోలిస్తే పోకిరీ ఫ్లాపే: వర్మ - Sakshi


పూరీ జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న టెంపర్ సినిమాను సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆకాశానికి ఎత్తేశారు. ట్విట్టర్లో వరుసపెట్టి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు ట్వీట్లు పోస్ట్ చేశారు. టెంపర్ సినిమాలో కొన్ని సీన్లు చూశానని, తారక్ నటన అత్యద్భుతంగా ఉందని వర్మ అన్నారు. పూరీ జగన్నాథ్ ఇప్పటివరకు సృష్టించిన హీరో పాత్రలలో ఇదే బెస్ట్ అని కితాబిచ్చారు. పూరీ తీసిన కమర్షియల్ సినిమాల్లో టెంపర్ నెంబర్ వన్ అని, అందులో పాటలు, వినోదం అన్నీ బాగున్నాయని.. అన్నింటికంటే తారక్ నటన శిఖరసమానమని అన్నారు. టెంపర్ సినిమా వచ్చిన తర్వాత పూరీ జగన్నాథ్ను జ'గన్' అనొచ్చని, తారక్ అతడి బుల్లెట్ అని వర్మ అభివర్ణించారు.



విమానాలను కూల్చే ట్యాంక్ నుంచి వచ్చే క్షిపణి కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఈ బుల్లెట్ ఉందని కితాబిచ్చారు. ఇక టెంపర్తో పోల్చుకుంటే ఇంతకుముందు వచ్చిన పోకిరీ, బిజినెస్మ్యాన్ లాంటి సినిమాలు ఫ్లాపుల్లాగే కనిపిస్తాయని ఓ వ్యాఖ్య చేశారు. అయితే.. తారక్తో సినిమా చేయడం కోసం ఆయన్ను కాకా పట్టడానికే తాను ఇన్ని ట్వీట్లు ఇచ్చానని జనం అనుకోవచ్చని, కానీ తనకు పూరీ జగన్నాథ్ అంత సామర్థ్యం లేదని చెప్పారు. టెంపర్ సినిమాలో తారక్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తనతో సినిమా చేసే అర్హత తనకు లేదన్న విషయం అర్థమైందని చెప్పారు.

 

 

 

 

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top