తెలుగు రాష్ట్రాల్లో 1000 థియేటర్లు

తెలుగు రాష్ట్రాల్లో 1000 థియేటర్లు - Sakshi


బాలీవుడ్ తర్వాత తెలుగులోనే ఎక్కువగా సినిమా నిర్మాణం జరుగుతుంటుంది. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అందుకు తగ్గ థియేటర్లు లేవు. అందుకే కేవలం థియేటర్లను నిర్మించడానికి 10 వేల కోట్ల రూపాయలను స్వదేశీ గ్రూప్ కేటాయించింది. ఈ గ్రూప్ ప్రాజెక్ట్ డెరైక్టర్ మోటూరి కృష్ణ ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ- ‘‘తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం వెయ్యి కోట్లతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు  చేయాలనుకుంటున్నాం. పండగ సీజన్ వస్తే చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకని పరిస్థితి. అందుకే చిన్న చిత్రాలను బతికించేందుకు స్వదేశీ షాపింగ్ మాల్స్‌లో థియేటర్లు ఏర్పాటు చేయబోతున్నాం.



ఒక్కో మాల్‌లో రెండు థియేటర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. రెండు తెలుగు రాష్టాల్లో వెయ్యి థియేటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు కోసం 10 వేల కోట్లు కేటాయిస్తున్నాం. పుణె ఫిలిమ్ ఇన్‌స్టి ట్యూట్ తరహాలో ఓ ఫిలిమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించబోతు న్నాం. రాఘవేంద్రరావు, దాసరి, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి సినీ పెద్దలతో ఓ ఎడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటు న్నాం’’ అన్నారు. స్వదేశీ గ్రూప్ టెక్నికల్ డెరైక్టర్ వాసిరెడ్డి మనోజ్, ఏజీఎమ్ రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top