నాలుగు ఆటలు!

నాలుగు ఆటలు! - Sakshi


కళానిలయ క్రియేషన్స్ పతాకంపై సిద్దాంశ్, రాహుల్, తేజస్విని హీరోహీరోయిన్లుగా లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి. రమేష్ నిర్మించిన చిత్రం ‘సినీ మహల్’. ‘రోజుకు నాలుగు ఆటలు’ ఉప శీర్షిక. శేఖర్ చంద్ర స్వరపరచిన ఈ చిత్రం పాటలను, ప్రచార చిత్రాన్ని దర్శకుడు మారుతి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ - ‘‘ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. పాటలు బాగున్నాయి. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు.



‘‘నేను దర్శకుడిగా ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం పార్థుగారు, సినీమహల్ రాజుగారు, కళానిలయ ప్రొడక్షన్స్’’ అని దర్శకుడు లక్ష్మణ్ వర్మ చెప్పారు. సహ నిర్మాతల్లో ఒకరైన పార్థు మాట్లాడుతూ - ‘‘తన ప్రాణాలను పణంగా పెట్టి హీరో టాకీస్‌ను ఎలా దక్కించుకున్నాడు?  అన్నదే కథ. డిఫరెంట్ లైన్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు.



రాహుల్, సత్య, గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమినీ సురేశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి. వెంకట్, సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ, చైతన్య కృష్ణ, హనుమాన్, సహ నిర్మాతలు: పార్థు, బాలాజీ, మురళీధర్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top