నా ఫిగరే జవాబు చెబుతుంది

నా ఫిగరే జవాబు చెబుతుంది - Sakshi


నటి సురభి చూడడానికి చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అయితే ప్రవర్తనలో మాత్రం చాలా బోల్డ్. ఇవన్‌వేరమాదిరి చిత్రం ద్వారా తమిళసినిమాకు పరిచ యం అయిన ఈ ఢిల్లీ బ్యూటీ ఇక్కడ వరుసగా అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది. ఆ మధ్య వేలై ఇల్లా పట్టాదారి చిత్రం చిన్న పాత్ర అయినా పెద్ద పేరే పొందిన సురభి తాజాగా నటుడు జై సరసన పుగళ్ చిత్రంతో తెరపైకి రావడానాకి సిద్ధం అవుతోంది. మరిన్ని ఆఫర్లు ఎదురు చూస్తున్నాయంటున్న ఈ భామతో చిన్న చిట్‌చాట్..

 

ప్రశ్న: ఉత్తరాది నుంచి వచ్చారు. తమిళ భాషలో నటించడం కష్టం అనిపించడం లేదా?

జ: నాకు చిన్నతనం నుంచి నట నంటే యమ పిచ్చి. హిరోయిన్ కా వాలన్నది నా కల. అందుకే యా క్టింగ్‌లో శిక్షణ పొందాను. అయితే తమిళంలో పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు వస్తాయని ఊహించలే దు. ఇక్కడ మరిన్ని చిత్రాలను చెయ్యాలని ఆ శిస్తున్నాను. అందుకే తమిళ భాష కష్టం అయి నా ఇష్టపడి నటిస్తున్నాను. ఒక రకంగా ఛాలెంజింగే. సంభాషణలను ఇంగ్లిష్ లో రాసుకుని బట్టీ పట్టి ముందుగా నే ప్రాక్టీస్ చేసుకుంటాను.డబ్బింగ్ నే ను చెప్ప ను కాబట్టి లిప్ మూమెంట్ విషయంలో జాగ్రత్త వహిస్తాను.చెన్నైకి వచ్చి వెళ్లడం వల్ల ఇప్పుడు తమిళ భాషను అర్థం చేసుకోగలుగుతున్నాను.

 

ప్రశ్న: మీ శారీరక భాష గురించి కామెంట్ చేసే వాళ్లపై మీ స్పందన?

జ: తమిళ భాష నాకిప్పుడు చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. నా శారీరక భాష సమ్‌థింగ్ బ్యాడ్ అనే వాళ్లకు ముందు ముందు నా ఫిగరే సమాధానం చెబుతుంది.

 

ప్రశ్న: ఇంకా యాక్షన్ క్లాసులకు వెళుతున్నారట?

జ: అవును ఢిల్లీలోని మెర్రీ జాన్ యాక్టింగ్ సూడియోలో యాక్టింగ్ క్లాసులకు వెళుతున్నాను. ఈ క్లాసులు నా యాక్టింగ్‌కు చాలా హెల్ప్ అవుతున్నాయి.



ప్రశ్న: సరే జైతో నటిస్తున్న పుగళ్ చిత్రం గురించి?

 జ: ఇది రాజకీయ నేపథ్యంలో రూపొం దుతున్న విభిన్న కథా చిత్రం.ఇందులో నాది చిన్న చిన్న విషయాల్లో కూడా ఫైట్ చేసే డామినేటెడ్ గర్ల్ పాత్ర. చిత్ర రెండవ భాగంలో హీరో జై మంచి పనులను అర్థం చే సుకుని తనకు సహకరిస్తాను. చాలా ఆసక్తికరమైన పాయింట్‌తో రూపొందుతున్న కథా చిత్రం.

 

ప్రశ్న: ఇతర భాషల్లో కూడా నటిస్తున్నట్లున్నారు?

జ: తెలుగులో ఇప్పటికే బిరువా చిత్రంలో నటించాను. త్వరలో శర్వానంద్ సరసన మరో చి త్రం చేయనున్నాను.అలాగే తమిళంలో ఒక పెద్ద చిత్రం చేయనున్నాను.ఆ విషయాలు తరువాత వెల్లడిస్తాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top