చిన్నోడి ప్రేమ పాట్లు...

చిన్నోడి ప్రేమ పాట్లు...


వరుస విజయాలతో నితిన్ దూసుకుపోతున్నారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, హార్ట్‌ఎటాక్ విజయాలతో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఈ యువ హీరో... ప్రస్తుతం సిక్సర్‌పై కన్ను వేశారు. అందులో భాగంగా ఆయన చేసిన సినిమానే ‘చిన్నదాన నీకోసం’. పేరులోనే కథ దాగున్న ఈ సినిమాకు ప్రేమకథల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకుడు. ఎన్.సుధాకరరెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది.



ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయి పడే పాట్లే ఈ చిత్ర కథ. దాన్నెంతో ఫన్నీగా తెరకెక్కించారు కరుణాకరన్. ప్రతి సన్నివేశం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అనూప్ రూబెన్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం పాటల ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకను నేడు తిరుపతిలో ఘనంగా జరుపనున్నాం’’ అని తెలిపారు. మిస్త్రీ కథానాయిక.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top