‘బూచమ్మ-బూచోడు’ నా కెరీర్‌లో మైలురాయి


విజయవాడ : సినీ పరిశ్రమలో ఉండాలా.. వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు  ‘బూచమ్మ-బూచోడు’ సినిమా  తనకు మంచి బ్రేక్ ఇచ్చిందని సినీ హీరో శివాజీ  చెప్పారు.  సోమవారం రాత్రి రామవరప్పాడులోని  కె-హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూచమ్మ-బూచోడు  సినిమా మంచి హిట్ అయిందని ఆనందం  వ్యక్తం చేశారు.  దాదాపు ఏడు సంవత్సరాలుగా తనకు మంచి సినిమాలు లేని నేపథ్యంలో ఈ చిత్రం తనను పరిశ్రమలో నిలబెట్టిందని పేర్కొన్నారు.

 

 ముఖ్యంగా  రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా  కృష్ణాజిల్లాలో రికార్డు స్థాయిలో  కలెక్షన్లు వసూలయ్యాయని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు, జిల్లా వాసులకు  కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ  సమావేశంలో నిర్మాత రవిచంద్ పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top