ఆ తప్పిదంపై ఘాటుగా స్పందించిన నటి

ఆ తప్పిదంపై ఘాటుగా స్పందించిన నటి


ముంబై: ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ లో చోటుచేసుకున్న ఓ పరిణామం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ ఘాటుగా స్పందించారు. వాస్తవానికి కేన్స్ లో సోనమ్ వేసుకున్న డ్రెస్సులన్నీ సూపర్ హిట్టయ్యాయి. పెట్టుకున్న నగలూ హిట్టే. రెడ్‌ కార్పెట్‌పై వయ్యారంగా ఆమె నడిచిన నడక కూడా హిట్టే. ఈసారి కేన్స్‌ ఉత్సవాల్లో సోనమ్‌కి తిరుగు లేకుండాపోయింది. కానీ ఒక్క విషయం ఆమెకు చాలా చిరాకు తెప్పించి ఉంటుంది.



తన ఫొటోకు దీపికా పదుకొనే అనే క్యాప్షన్ వాడటం ఉద్దేశపూర్వకంగా జరగలేదని, పొరపాటుగా విదేశీ మీడియా అలా రాసి ఉండొచ్చునని ట్వీట్ చేశారు. పీఆర్ లను అసలు నమ్మకూడదని, నిజాలను తెలుసుకోవాలని సూచించారు. సోనమ్ గురించి తప్పుగా చేసిన పోస్ట్ ను చాలా మంది రీట్వీట్ చేయడం, కామెండ్ చేయడం ఆమెను స్పందించేలా చేశాయి. తనకు గుర్తింపు లేదన్నట్లు ప్రచారం చేయడం తగదని, కేవలం చిన్న తప్పిదంతో దీపికా పేరు రాశారని వివరణ ఇచ్చారు. జాత్యహంకార భావనతో విదేశీ మీడియా తప్పిదం చేయలేదని, అనవసరంగా ఈ విషయాన్ని భూతద్దంలో చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.



సోనమ్ కపూర్ ఫొటోను షేర్ చేస్తూ క్యాప్షన్ గా దీపికా పదుకొనే అని అమెరికా ఫొటో స్టాక్ ఏజెన్సీ రాసింది. ఆపై ఆ పోస్ట్ వైరల్ గా మారడంతో వారు తమ తప్పిదాన్ని తెలుసుకున్నారు. భారత నటి దీపికా పదుకొనే విచ్చేశారని సోనమ్ ఫొటోకు క్యాప్షన్ గా మే 21న రాసిన విషయం విదితమే. ఈ వివాదం ఇదే తొలిసారి కాదు. గతంలో దీపికా పదుకొనే ఫొటోలను ప్రచురిస్తూ భారత నటి ప్రియాంక చోప్రా అని రాయడం దుమారాం రేపిన విషయం తెలిసిందే. ఇకనుంచి అయినా అంతర్జాతీయ మీడియా గూగుల్ లో వెతికి వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయడం, పోస్టులు పెట్టడం చేస్తే బాగుంటుందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top