తెరపైకి యశ్‌చోప్రా జీవితకథ!

తెరపైకి యశ్‌చోప్రా జీవితకథ!


డర్, చాందిని, లమ్హే, దిల్ తో పాగల్ హై, వీర్ జారా... యశ్ చోప్రా పేరు తలచుకోగానే  ఈ సినిమాలన్నీ గుర్తుకొస్తాయి. బాలీవుడ్‌లో రొమాంటిక్ సినిమాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడాయన. యశ్ చోప్రా చనిపోయి రెండేళ్లవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థం ‘యశ్‌రాజ్ మెమోరియల్ అవార్డు’ని ప్రవేశపెట్టారు. గత ఏడాది ఈ అవార్డును ప్రముఖ గాయని అతా మంగేష్కర్‌కి ఇచ్చారు. ఈ ఏడాది అమితాబ్ బచ్చన్‌కి ఇవ్వనున్నారు.



ఈ వేడుక డిసెంబర్‌లో జరగనుంది. కాగా, అమితాబ్ బచ్చన్‌కి అవార్డు ప్రదానం చేయనున్న విషయాన్ని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ప్రకటించారు. ఈ సమావేశంలో.. యశ్ చోప్రా జీవితం ఆధారంగా ఓ సినిమా తీయాలనే ఆలోచన ఉందని ఆయన సతీమణి పమేలా చోప్రా పేర్కొన్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుందని ఆమె తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top