'భలే మంచి రోజు' మూవీ రివ్యూ

'భలే మంచి రోజు' మూవీ రివ్యూ


టైటిల్ : భలే మంచి రోజు

జానర్ : క్రైం కామెడీ థ్రిల్లర్

తారాగణం : సుధీర్ బాబు, వామిక గబ్బి, ధన్యా

సంగీతం : సన్నీ ఎం.ఆర్

దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత : విజయ్, శశి




ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చి, చాలా రోజులుగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న నటుడు సుధీర్ బాబు, కమర్షియల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకోకపోయినా, డిఫరెంట్ స్టోరీస్తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోసారి సరికొత్త కాన్సెప్ట్తో క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన 'భలే మంచి రోజు' సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఒకే రోజు జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ను ఎంత వరకు ఆకట్టుకుంది. ఆడియో రిలీజ్లో మహేష్ బాబు చెప్పినట్టుగా ఈ సినిమాతో సుధీర్ బాబు స్టార్ స్టేటస్ అందుకున్నాడా..?



కథ :

ప్రేమలో విఫలమైన రామ్ (సుధీర్ బాబు) తనను కాదని వేరే పెళ్లి చేసుకుంటున్న ప్రియురాలి మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరతాడు. అదే సమయంలో ఉండ్రాజవరంలో కాసేపట్లో పెళ్లి పీటలెక్కబోతుందనుకున్న సమయంలో పెళ్లి కొడుకు పారిపోవటంతో  సీత(వామిక గబ్బి) పెళ్లి ఆగిపోతుంది. ఆ హడావిడిలో ఉండగానే శక్తి(సాయికుమార్) సీతను కిడ్నాప్ చేసి తీసుకెళతాడు. అలా వెళుతున్న శక్తి వెహికల్ను రామ్ గుద్దేస్తాడు. ఈ యాక్సిడెంట్లో శక్తి కిడ్నాప్ చేసిన సీత తప్పించుకునిపారిపోతుంది.


 


దీంతో ఇందుకు కారణమైన రామే, సీతను తీసుకురావాలని రామ్ స్నేహితుడు ఆదిని (ప్రవీణ్) బంధిస్తారు శక్తి మనుషులు. స్నేహితుడిని కాపాడుకోవటం కోసం సీతను తీసుకురావడానికి బయలుదేరుతాడు రామ్, ఈ జర్నీలో ఈశు, ఆల్బర్ట్ అనే కిడ్నాపర్లను కలుస్తాడు. వారితో కలిసి రామ్ ప్రయాణం ఎలా సాగింది. చివరకు రామ్, సీతను పట్టుకున్నాడా..? అన్నదే మిగతా కథ.





నటీనటులు :

సక్సెస్ పరంగా ఆకట్టుకోలేక పోయినా, నటుడిగా ప్రతి సినిమాకు మెరుగవుతూ వస్తున్నాడు సుధీర్ బాబు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ యంగ్ హీరో, ఈ సినిమాలో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్ లోనూ మెప్పించాడు. చూడటానికి కాస్త బొద్దుగా ఉన్నా, వామిక గబ్బి హీరోయిన్గా మెప్పించింది. ముఖ్యంగా ఎనర్జీ, ఈజ్తో తెలుగు ఆడియన్స్ను ఆకట్టుకుంది. సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేకపోయిన మాట్లాడిన రెండు, మూడు సన్నివేశాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కామెడీ విలన్గా సాయికుమార్ అలరించాడు. ఇక క్లైమాక్స్లో వచ్చే 30 ఇయర్స్ పృథ్వీ క్యారెక్టర్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ప్రవీణ్, శ్రీరామ్, విద్యుల్లేఖ, పోసాని కృష్ణమురళి, పరుచూరి గోపాలకృష్ణలు తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు.



సాంకేతిక నిపుణులు :

క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో క్రైమ్, థ్రిల్లర్ కన్నా కామెడీ పాల్లే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రొటీన్ కామెడీ సన్నివేశాలు కాకుండా కథానుగుణంగా రాసిన కామెడీ సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తాయి. తొలిభాగం విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేసిన దర్శకుడు రెండో భాగం విషయంలో మాత్రం అంత పట్టు చూపించలేకపోయాడు. స్లో నారేషన్తో ఆడియన్స్ సహనాన్ని పరీక్షించాడు. అయితే క్లైమాక్స్ 20 నిమిషాలతో ఆడియన్స్ అప్పటి వరకు పడ్డ కష్టమంతా మరిపోయేలా చేశాడు.


 


సినిమాటోగ్రఫీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. డార్క్ కామెడీగా తెరకెక్కించిన ఈ సినిమాకు అలాంటి లైటింగ్, లోకేషన్స్నే వాడటం చాలా బాగా కుదిరింది. సన్నీ ఎంఆర్ మంచి సంగీతం అదించినప్పటికీ పాటలు అవసరం లేని సినిమాలో అనవసరంగా ఇరికించటంతో సినిమాకు ఇబ్బంది కలిగించాయి. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నేపథ్య సంగీతం బాగున్నా అక్కడక్కడా డైలాగ్స్ వినిపించకుండా డామినేట్ చేసింది. విజయ్, శశిల నిర్మాణ విలువలు బాగున్నాయి.





ప్లస్ పాయింట్స్ :

సుధీర్ బాబు, వామిక గబ్బి

కామెడీ

సినిమాటోగ్రఫి

క్లైమాక్స్



మైనస్ పాయింట్స్ :

స్లో నారేషన్

సెకండాఫ్

పాటలు



ఓవరాల్గా భలే మంచి రోజు మంచి కామెడీతో ఆకట్టుకునే డీసెంట్ అటెంప్ట్

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top