పూరి స్పీడు మామూలుగా లేదు..!

పూరి స్పీడు మామూలుగా లేదు..! - Sakshi


రోగ్ సినిమా తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ సినిమా.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుందట.. అది కూడా ఏదో డైలాగ్ సీన్స్ కాదు సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీక్వన్స్ను పూర్తి చేశారు పూరి, బాలయ్య. నమ్మటానికి కాస్త కష్టంగా ఉన్న పూరి స్పీడు తెలిసి వారు నిజమే అయి ఉంటుందంటున్నారు.



మార్చి 16న షూటింగ్ ప్రారంభించి పూరి ఆ రోజు బాలకృష్ణ ఎనర్జీ సూపర్బ్ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసి వారం రోజులు కూడా గడవక ముందే మరో ట్వీట్ తో షాక్ ఇచ్చాడు. ' ఎన్బికె 101 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. భారీ సెట్ లో యాక్షన్ సీక్వన్స్.. ఈ సీన్స్ అందరినీ అలరిస్తాయి'  అంటూ ట్వీట్ చేశాడు. పూరి స్పీడు చూస్తుంటే నిజంగానే అనుకున్న సమయం కన్నా ముందే సినిమా పూర్తి చేసేలాగే ఉన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top