బాహుబలి టీజర్ విడుదల

బాహుబలి టీజర్ విడుదల - Sakshi


రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా టీజర్ను విడుదల చేశారు. శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో20 సెకన్ల నిడివి గల ఈ టీజర్ను రాజమౌళి, నటుడు రానా ఆవిష్కరించారు.  నెటిజన్ల కోసం హీరోయిన్ అనుష్క టీజర్ను విడుదల చేశారు. టీజర్లో ప్రభాస్, రానాలు కనిపిస్తారు. భారీ యుద్ధ సన్నివేశాలతో కూడిన ఈ టీజర్ను అద్భుతంగా ఉంది.



బాహూబలి ట్రైలర్ ను సోమవారం విడుదల చేయనున్నారు. కటింగ్ ఎడ్జ్ డాల్బీ ఎట్మాస్ మిక్సింగ్‌తో రూపొందించిన 2 నిమిషాల ట్రైలర్ ప్రేక్షకులకు హై క్వాలిటీ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. తెలుగులో తొలిసారిగా 'బాహుబలి'  కోసం ఈ టెక్నాలజీ వాడారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'బాహుబలి' తెలుగు ఆడియో, ట్రైలర్‌ల విడుదల వాయిదా పడిన విషయం తేలిసిందే. మే 31 హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వేలాది అభిమానుల మధ్య జరుపుదామనుకున్న వేడుక చివరకు అదే అభిమానుల సంఖ్య కారణంగా వాయిదా పడింది. టీజర్ ను ట్విట్టర్ ద్వారా కూడా విడుదల చేశారు.


 

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top