రావే మా ఇంటికి...

రావే మా ఇంటికి... రావే మా ఇంటికి...


‘చిన్నారి పెళ్లికూతురు’ టీవీ సీరియల్‌తో స్టార్‌డమ్ తెచ్చుకున్న అవికాగోర్ ‘ఉయ్యాల జంపాల’తో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె 20 కథలు విన్నారు. ఫైనల్‌గా ఆమెకో కథ నచ్చింది. అదే ‘లక్ష్మీ రావే మా ఇంటికి’. వైజాగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ కుటుంబ ప్రేమకథ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడు. రచయిత నంద్యాల రవి దర్శకునిగా పరిచయమవుతున్నారు. గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

  ఇటీవలే పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత నాగశౌర్య - అవికాగోర్‌ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. టైటిల్‌కి మంచి గుర్తింపు వచ్చింది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఆగస్టు 6తో టాకీపార్ట్ పూర్తవుతుంది. అదే నెలాఖరు నుంచి వైజాగ్‌లో పాటల చిత్రీకరణ చేస్తాం. కేఎం రాధాకృష్ణన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆనంద్, గోదావరి, చందమామ తరహాలో సంగీతం ఆహ్లాదకరకంగా ఉంటుంది’’ అని తెలిపారు. రావు రమేశ్, నరేశ్, వెన్నెల కిశోర్ తదితరులు ఇందులో ముఖ్యతారలు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top