రిస్క్ చేస్తూనే ఉంటా: అనుష్క
బీజింగ్: నిర్మాతగా రిస్క్ చేస్తూనే ఉంటానని బాలీవుడ్ నటి అనుష్క శర్మ తెలిపింది. ఆమె నిర్మించిన ఎన్ హెచ్ 10 సినిమా బీజింగ్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అనుష్కకు అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది.
ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ... నటి నుంచి నిర్మాతగా మారడం మరచిపోలేని అనుభవమని పేర్కొంది. ఎన్ హెచ్ 10 సినిమా సక్సెస్ క్రెడిట్ దర్శకుడు నవదీప్ సింగ్, రచయిత సుదీప్ శర్మలకే చెందుతుందని వెల్లడించింది. పాటలు, డాన్సులు లేకుండా మంచి కథలు దొరికితే నిర్మించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. రిస్క్ చేసేందుకు వెనుకాడబోనని అనుష్క శర్మ తెలిపింది. తాను తాజాగా నటించిన డబుల్ రోల్ ను తెరపై చూసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పింది.
సంబంధిత వార్తలు